Category archives for: News

రాజమౌళి ‘బాహుబలి’లో రాజకుమారిగా ఆమెనే?

18-shruti-hassan-300

‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో రాజకుమారి పాత్రలో శృతి హాసన్ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. సినిమా ప్లాప్ అయినా ఆమెకు వచ్చిన క్రేజే వేరు. దాంతో రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి’ లో ఓ ముఖ్య పాత్రకు గానూ ఈ సుందరిని ఎంపికచేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని చిత్ర వర్గాల సమాచారం. ‘గబ్బర్‌సింగ్’తో తారాపథంలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లిన శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ [...]

ఏ హీరోని ఉద్దేశించి ప్రభాస్ ఆ కామెంట్?

18-prabhas000

“ఒక సినిమా ఆడినంత మాత్రాన, వరుసగా రెండుమూడేళ్లు హిట్‌లు ఇచ్చినంత మాత్రాన నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నట్టు కాదు. 10-20 ఏళ్ళు కమర్షియల్ సక్సెస్‌తో ఉంటే అప్పుడు నెంబర్‌వన్ అంటారు. అయినా నేనెప్పుడూ నెంబర్ వన్‌గా భావించలేదు. నేనైతే నెంబర్ వన్ కాదు. ఇంకెవరో మీరే ఆలోచించండి అంటూ ప్రభాస్ కుండ బ్రద్దలు కొట్టినట్లు తెలుగులో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం గురించి తేల్చి చెప్పారు. దాంతో ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ప్రబాస్ ఇలా [...]

ఎడారిలో… పరాటాలు తింటూ రాజమౌళి వేట!

18-rajamouli

దర్శకుడు రాజమౌళి ‘బహుబలి’ అనే భారీ బడ్జెట్ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి లొకేషన్లు వెతికే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఇటీవలే కర్నాటక, కేరళల్లో పలు లొకేషన్లను పరిశీలించిన రాజమౌళి ఈ వారం రాజస్థాన్ లో లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన రాజమౌళి…మగధీర సినిమా షూటింగు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అంతే కాదు అక్కడ తిన్న ఆలూ పరాటాలు యమటేస్టీగా ఉన్నాయంటూ ట్విట్టర్లో అందుకు సంబంధించిన ఫోటోలు [...]

తెలుగు దర్శకుడుతో కమల్ హాసన్ చిత్రం

17-kamal

కమల్ హాసన్ ఓ తెలుగు చిత్రంలో నటించటానికి ఓకే చేసారా..అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ‘ఎన్‌కౌంటర్’ దర్శకుడు ఎన్.శంకర్‌తో చేయటానికి ఆయన ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నారు. ఇటీవల చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు కమల్ ఓకే చెప్పారనేది ఓ పాపులర్ తెలుగు దినపత్రిక వెల్లడించింది. సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా తీయనున్నారు. అయితే రూమరా,నిజంగానే ఓకే చెప్పారా అనే విషయం తెలియాలంటే ఎన్ శంకర్ కానీ,కమల్ కానీ వివరణ [...]

లగడపాటి శ్రీధర్ చిత్రంలో నాగచైతన్య…

18-naga-chaitanya107-300

ఎవడిగోల వారిదే,స్టైల్, స్నేహగీతం వంటి చిత్రాల నిర్మాత లగడపాటి శ్రీధర్ తాజాగా ఓ చిత్రం నిర్మించటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా చేస్తున్నారు. ఆ సినిమానే ‘చార్మినార్’రీమేక్ . ఈ కన్నడ చిత్రాన్ని ఆర్.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాను సదరు దర్శకునితో కలిసి నాగచైతన్య, నిర్మాత లగడపాటి శ్రీధర్ ఇటీవల హైదరాబాద్‌లో చూసారు. నాగచైతన్యకి ‘చార్మినార్’ విపరీతంగా నచ్చేయడంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నటించడానికి ‘ఓకే’ చెప్పేశారు. ‘‘దర్శకుడు ఈ [...]

లండన్‌లో మకాం వేయబోతున్న మహేష్ బాబు

18-mahesh-svsc

సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్‌‌లో నెల రోజులకు పైగా మకాం వేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు కానున్నాయి. ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో ‘దూకుడు’ [...]

ఆ ఎఫెక్ట్ లేదు-‘బాద్ షా’ విడుదలపై బండ్ల గణేష్ ట్వీట్

16-baadshah-300

నిర్మాత బండ్ల గణేష్‌ ఇంటిపై ఇటీవల ఐటి దాడులు జరుగడం, రెండు రోజుల పాటు ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించడం, ఆ తర్వాత అతన్ని ఇన్‌కం టాక్స్ ఆఫీసుకు పిలిపించి ప్రశ్నించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావం ఆయన ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తున్న ‘బాద్ షా’ చిత్రంపై పడుతుందని అంతా భావించారు. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ బండ్ల గణేష్ [...]

సానియా మీర్జా జీవితం ఆధారంగా రెండు చిత్రాలు

15-sania13-300

సానియా మీర్జా జీవితం ఆధారంగా త్వరలో బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది . ఈ చిత్రంలో ప్రధానపాత్రను దేబినా బెనర్జీ పోషించనుంది. ఈమె ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ‘రామాయణ్‌’ ధారావాహికలో సీత పాత్రను బుల్లితెరపై పోషించింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు.చిత్రానికి ‘హైదరాబాద్‌ దామాద్‌’ (హైదరాబాద్‌ అల్లుడు)అని పేరుపెట్టనున్నారు. కానీ తన జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కనున్నట్లు తెలియదని సానియా మీర్జా అనడం కొసమెరుపు. [...]

కమల్‌ హాసన్‌, శ్రీదేవి కాంబినేషన్ లో కొత్త చిత్రం

15-kamal-sridevi

చాలా కాలం గ్యాప్ తర్వాత కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా నటించబోతున్నారనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల కిందట వారిద్దరూ ‘సద్మా’ చిత్రంలో నటించారు. ఇటీవలే ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’తో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు శ్రీదేవి. ఈ నేపథ్యంలో కమల్‌ ఆమె కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. మరో ప్రక్క కమల్ హాసన్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రం చేయబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నిర్మాత బ్యారీ [...]

నమ్మకమైన కుక్క, చెడ్డ పిల్లాడు=కసబ్ : వర్మ

15-varma06-300

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైపై దాడి సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘26/11 ఇండియాపై దాడి’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపెట్టనున్నారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడదల కానుంది. దాదాపు [...]

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in