లండన్‌లో మకాం వేయబోతున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్‌‌లో నెల రోజులకు పైగా మకాం వేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు కానున్నాయి. ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే….బాలీవుడ్ మూవీ ‘ఏక్ థా టైగర్’కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో ‘మహేష్ బాబు-సుకుమార్’ సినిమాకు పని చేయబోతున్నారు.

సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే… ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

Posted by on Feb 18 2013. Filed under Featured, News. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Leave a Reply

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in