‘పిజ్జా’ మూవీ రివ్యూ…

దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత : సురేష్ కొండేటి సంగీతం : సంతోష్ నారాయణన్ నటీనటులు : విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్, నరేన్, పూజా, జైకుమార్, వీరసేతురామన్ తదితరులు

కథ : మైఖేల్(విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. తన గర్ల్ ఫ్రెండ్ అను(రమ్య నంబీసన్)తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంటాడు. అనుకి దెయ్యాలపై నమ్మకం ఎక్కువ. దయ్యాలపై నవల రాసేందుకు అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ మైఖేల్‌కి ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదు. ఈ క్రమంలో పిజ్జా రెస్టారెంట్ ఓనర్ షన్ముగం(నరేన్)కూతురుకి దెయ్యం పడుతుంది. అప్పటి నుంచి అతనిలో దెయ్యాలంటే భయం మొదలవుతుంది. ఓ సారి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లిన మైఖేల్ భయానక పరిస్థితులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అను మిస్సవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లింగ్ అనుభూతినిస్తాయి. హీరో విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.

అతని నటన సినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు. హారర్ నావెలిస్ట్‌గా రమ్య నంబీసన్ లుక్స్ కూల్ గా ఉండటంతో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది.

అయితే ఆమె మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుడేంది. ఇతర నటీనటులు నరేన్, పూజా, జైకుమార్, వీరసేతు రామన్ కూడా వారి పాత్రలకు తగిన విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సంతోష్ నారాయణ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్సయింది. సీన్లకు, స్క్రీన్ ప్లేకి తగిన విధంగా మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని హారర్ సీన్లకు బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా సూటయింది. గోపీ అమర్నాథ్ పిక్చరైజేషన్ సినిమాకు మరో హైలెట్.

ఇతర సాంకేతిక విభాగాలు కూడా బాగా పని చేసాయి. ఇండియన్ బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘పిజ్జా’ కూడా చోటు దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వండర్ పుల్ స్టోరీలైన్ తో పాటు దానికి తగిన విధంగా స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ అంశాలను ఆశించకుండా హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

Posted by on Feb 15 2013. Filed under Featured, Reviews. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Leave a Reply

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in