తెలుగు దర్శకుడుతో కమల్ హాసన్ చిత్రం

కమల్ హాసన్ ఓ తెలుగు చిత్రంలో నటించటానికి ఓకే చేసారా..అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ‘ఎన్‌కౌంటర్’ దర్శకుడు ఎన్.శంకర్‌తో చేయటానికి ఆయన ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నారు. ఇటీవల చెప్పిన కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు కమల్ ఓకే చెప్పారనేది ఓ పాపులర్ తెలుగు దినపత్రిక వెల్లడించింది. సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా తీయనున్నారు. అయితే రూమరా,నిజంగానే ఓకే చెప్పారా అనే విషయం తెలియాలంటే ఎన్ శంకర్ కానీ,కమల్ కానీ వివరణ ఇవ్వాల్సిందే. ఇక గతంలో శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, భద్రాచలం సినిమాలు కూడా వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందినవే.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జగపతిబాబు హీరోగా ‘జైబోలో తెలంగాణ’ చిత్రం రూపొందించిన తర్వాత.. ఇప్పటివరకు శంకర్ మరో చిత్రం ఏదీ చేయలేదు. ప్రస్తుతం కమల్‌తో సినిమా కోసం స్క్రిప్టు పని చేస్తున్నట్లు సమాచారం. విశ్వరూపం సీక్వెల్‌తో పాటు మరో హాలీవుడ్ సినిమాకు కూడా ఇప్పటికే ఓకే చెప్పిన కమల్.. మరి ఈ సినిమాలో ఎప్పుడు నటిస్తారో చూడాల్సి ఉంది. మరో ప్రక్క చాలా కాలం గ్యాప్ తర్వాత కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా నటించబోతున్నారనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల కిందట వారిద్దరూ ‘సద్మా’ చిత్రంలో నటించారు. ఇటీవలే ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’తో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు శ్రీదేవి. ఈ నేపథ్యంలో కమల్‌ ఆమె కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

మరో ప్రక్క కమల్ హాసన్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రం చేయబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నిర్మాత బ్యారీ అబ్స్ బోర్న్ తో కలిసి కమల్ ఈ చిత్రం చేయనున్నారు. కమల్ దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వ రూపం చిత్రం చూసి ఆయనతో చిత్రం చేయటానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రం టైటిల్ ‘All are Kin’…అంటే తెలుగులో అంతా మనవాళ్లే అని. ఈ చిత్రం భారతీయ సంస్కృతి,చరిత్రను ఉద్దేశించి ఉంటుంది. ఈ చిత్రానికి కమల్ కి మంచి రెమ్యునేషన్ ముట్టనున్నదని తెలుస్తోంది.

Posted by on Feb 18 2013. Filed under Featured, News. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Leave a Reply

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in