చమ్మక్ చల్లో’రివ్యూ

షో,మిస్సమ్మ వంటి కమర్షియల్ ప్రయోగ చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ నుంటి కొత్త చిత్రం వస్తోందంటే ఏదో విభిన్నత ఉండే ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. అయితే నమ్మకాలు వమ్మవతూండటం సినిమాల విషయంలో అతి సాధారణం. దానికితోడు అప్పుడెప్పుడో హిట్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ తో కొత్త తరహా ప్రేమ కథ చేస్తున్నానంటూ నేరేషన్ లో డ్రాగ్ చేసిన లవ్ స్టోరీ అందించాడు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న కిషోర్(అవసరాల శ్రీనివాసరావు) ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్టు కోసం వెతుకుతూంటాడు. ఆ క్రమంలో అతనికి ఫ్రొఫెసర్ అప్పారావు (షాయీజీ షిండే)తగులుతాడు. ఆయన తన స్టూడెంట్స్ నిజ జీవిత ప్రేమ కథ ఉందని చెప్పటం మొదలెడతాడు. ఆ కథే ..శ్యామ్(వరుణ్ సందేశ్), అన్షు(సంచిత పదుకోనె)లది. తన కాలేజీలో చదువుకుంటున్న వారి ప్రేమకు దారి తీసిన అంశాలు..అది ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లటం దాకా వివరిస్తాడు. ఈలోగా శ్యామ్…జీవితంలోకి ఊహించని విధంగా సునయిన(కేధరిన్)వచ్చిందని,

అక్కడ నుంచి ఈ లవ్ పెయిర్ లో కాంప్లికేషన్స్ మొదలయ్యాయని చెప్తాడు. ఆ కథ విన్న దర్శకుడు కిషోర్ ఎలా రియాక్టు అయ్యాడు..శ్యామ్ ప్రేమ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చాడనేది మిగతా కథ. నిజానికి ఈ సబ్జెక్టు పూర్తిగా ట్రీట్ మెంట్ మీద ఆధారపడింది. నేటీ యువత యువకుల ఆలోచనలు,కన్ఫూజన్స్, ప్రేమలు చర్చిద్దామని దర్శకుడు ఈ చిత్ర కథ రాసుకున్నట్లు అర్దం అవుతుంది. అయితే నేరేషన్ లో కొత్తగా చెప్దామనుకుని రెగ్యులర్ ట్విస్ట్ లతోనే కథనం నడిపించటం..అదీ మరీ స్లోగా ఆర్ట్ సినిమా తరహాలో నడపటం సినిమాకు మైనస్ గా మారింది. ముఖ్యంగా యూత్ చాలా స్పీడుగా ఉంటున్నారు. వారి ఆలోచనల వేగాన్ని అందుకునేలా నేరేషన్ ఉంటే బాగుండేది. అయితే లవ్ స్టోరీలు స్లో నేరేషన్ లో చెప్తే ఆ ఫీల్ ఇంజెక్టు అవుతుందని ఈ జాతీయ దర్శకుడు భావించి ఇలాంటి చిత్రం అందించినట్లున్నారు. కథని మరింత షార్పు చేసుకుని, సీన్స్ లో వేగం పెంచితే ఖచ్చితంగా వర్కవుట్ అయ్యే సబ్జెక్టు ఇది. అప్పటికీ దర్శకుడు నీలకంఠ…కొత్త తరహాలో ప్రెజెంట్ చేయటానికి టైటిల్స్ దగ్గరనుంచి ప్రయత్నించారు. కానీ…కనికట్టు చేసి ఆకట్టుకోలేకపోయారు. అలాగే ప్రేమ కథలకు ప్లస్ కావాల్సిన సంగీతం ఈ చిత్రానికి మైనస్ గా మారింది. అలాగే కథను నడిపే శాయీజీ షిండే పాత్రకు లవ్ స్టోరీని నడిపేటంత మోటివ్ అస్సలు కనపడదు.

డిఫెరెంట్ ప్రేమ కథను తెరపై ఆవిష్కరిస్తానంటూ వచ్చిన ఈ చిత్రం రొటీన్ వరుణ్ సందేశ్ ప్లాప్ ల లిస్ట్ లో కలిసిపోయేటట్లు కనపడుతోంది. ఓపినింగ్స్ కూడా అంతంత మాత్రం తెచ్చుకున్న ఈ చిత్రం నీలకంఠ అభిమానులను కూడా నిరాసపరుస్తుంది.

Posted by on Feb 15 2013. Filed under Featured, Reviews. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Leave a Reply

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in