ఎడారిలో… పరాటాలు తింటూ రాజమౌళి వేట!

దర్శకుడు రాజమౌళి ‘బహుబలి’ అనే భారీ బడ్జెట్ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి లొకేషన్లు వెతికే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఇటీవలే కర్నాటక, కేరళల్లో పలు లొకేషన్లను పరిశీలించిన రాజమౌళి ఈ వారం రాజస్థాన్ లో లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన రాజమౌళి…మగధీర సినిమా షూటింగు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అంతే కాదు అక్కడ తిన్న ఆలూ పరాటాలు యమటేస్టీగా ఉన్నాయంటూ ట్విట్టర్లో అందుకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేసాడు. ఇక బహుబలి సినిమా విషయానికొస్తే… మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి.

ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ‘బహుబలి’ టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

Posted by on Feb 18 2013. Filed under Featured, News. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Leave a Reply

Search Archive

Search by Date
Search by Category
Search with Google

Photo Gallery

Log in